ప్రజాశక్తి-విజయనగరం కోట : రైల్వే అండర్ పాస్ వేస్ నీటితో నిండిపోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మురసు తుఫాన్ ప్రభావం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఉండటంతో విజయనగరం మండలంలో ఉన్న పినవేమలి, జొన్నవలస, సారిక నుంచి విజయనగరం నగరానికి చేరుకోవాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. జొన్నవలస రైల్వే అండర్ పాస్ వే తుఫాన్ ప్రభావంతో వరద నీరు నిండి పోవడంతో ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా భీమసింగి నుంచి కోరుకొండ, కోరుకొండపాలెం ,కొత్తూరు దారిలో ఉన్న కోరుకొండ రైల్వే అండర్ పాస్ వే ఉంది ఇక్కడ కూడా తుఫాన్ ప్రభావంతో నీటితో నిండిపోయాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో మరో గత్యంతరం లేక చూట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది. ఆయా రైల్వే అండర్ పాస్ వే లో ఉన్న నీటి ని రైల్వే సిబ్బంది మోటార్ తో తొలగిస్తున్నారు.
రైల్వే అండర్ పాస్ నీటిమయం - పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)