అభినందించిన స్పెక్ట్ కుటుంబం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, అనారోగ్యంతో మంచాన పడిన తల్లిని చూసుకుంటూ మొక్కవోని దీక్షతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని స్పెక్ట్ స్కాలర్ విద్యార్థి రామకృష్ణ ముంబైకి చెందిన బిఎఆర్సి (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్) లో సైంటిస్ట్ గా ఎంపికయ్యారు. రామకృష్ణ తన చిన్నతనంలో ఆరిలోవలో స్పెక్ట్ నిర్వహించిన వసతి గృహంలో విద్యను అభ్యసించారు. అనంతరం స్పెక్ట్ స్కాలర్ విద్యార్థిగా ఉన్నత విద్యను అభ్యసించి స్పెక్ట్ కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన రామకృష్ణను స్పెక్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, స్పెక్ట్ చీఫ్ మెంటర్ చాపరాల ఇందిర, ట్రెజరర్ శ్రీహరి రాజు, స్పెక్ట్ ప్రతినిధులు షిణగం శివాజీ , ఎస్.ఇందిర, సుబ్బలక్ష్మి, ఎం.అరుణ తదితరులు అభినందనలు తెలియజేశారు. విద్యాబుద్ధులు నేర్పించి, సైంటిస్ట్ గా తనను ఉన్నత స్థానంలో నిలబెట్టిన స్పెక్ట్ వ్యవస్థాపకరాలు డాక్టర్ గూడూరు సీతామాలక్ష్మికి స్పెక్ట్ ఇతర కుటుంబ సభ్యులకు రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.









కామెంట్‌లు (0)