పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు నియోజకవర్గంలో కూటమి పార్టీల తరపున స్దానిక సంస్దల ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటిసి, ఎంపిటిసి అభ్యర్దులకు మంత్రి నిమ్మల రామానాయుడు పార్టీల బి ఫారంలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ ఫరీష్ కూడా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ .... స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి, గొడ్డలి పార్టీ ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. ప్రజా బలం పూర్తిగా కోల్పోయిన గొడ్డలి పార్టీ స్దానిక సంస్దల ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశతో ఎన్నికల ప్రక్రియకు అడుగడుగునా అడ్డుతగులుతోందని మంత్రి చెప్పారు. పుంగనూరు, రాయచోటి, దర్శి, పల్నాడు ప్రాంతం వంటి అనేక చోట్ల, ఇతర రాష్ట్రాల నుంచి గుండాలను, కిల్లర్ గ్యాంగులను రప్పించి రక్తపాతం సృష్టించాలని చూసి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారని చెప్పారు. గొడ్డలి పార్టీ తరపున పోటీచేయడానికి అభ్యర్దులే ముందుకు రాలేదని చెప్పారు. తమ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికే వారిని నామినేషన్ వేయనీయడం లేదంటూ, కోర్టులకెక్కిన విషయం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. 2020-21 స్థానిక ఎన్నికల్లో జగన్ తాను సృష్టించిన అరాచకాలు, అకృత్యాలు మరిచిపోయి, ఒక్క ఘటన చూపించమని సవాల్ విసురుతున్నాడని చెప్పారు. గొడ్డల పార్టీకి చిన్నపాటి అవకాశం ఇచ్చినా, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు అధోగతి పాలవుతుంది అన్నారు.
పార్టీల బి- ఫాం అందించిన మంత్రి నిమ్మల
27 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 11:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)