శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాలకొల్లు లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ

30 అక్టోబర్, 2026

Power restored in some areas of Palakollu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 03:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు ఆ శాఖ యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది. పాలకొల్లు పట్టణంలో ముందుగా రైల్వే గేటు తూర్పు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. 26 వార్డులోని కొన్ని ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున విద్యుత్ పునరుద్ధరించారు మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం పునరుద్ధరించారు. దీంతో బాధితుల ఆనందానికి అంతులేకుండా ఉంది. గత 3 రోజులుగా విద్యుత్తు లేకపోవడంతో కనీసం చార్జర్లు సెల్ ఫోను టీవీలు ఆఖరికి తాగునీరు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యుత్తు వచ్చిన ప్రాంతాల్లో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ శాఖ ఎడిఇ సిహెచ్ రామకృష్ణ, ఎఇ బాబ్జి సారధ్యంలో పాలకొల్లులో 300 మంది కార్మికులు విద్యుత్ పునరుద్ధరణకు రేయింబగళ్లు కృషి చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్