ప్రజాశక్తి -నరసాపురం: రుస్తుంబాద వద్ద 216 హైవే రోడ్డుపై శుక్రవారం ఉదయం లారీ ఆగి ఉంది. బైక్‌పై వెళ్తున్న యువకుడు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న యువకుడికి తల, శరీర భాగాలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. పరిస్థితి విషమించడంతో ఆ యువకుడు ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. మృతి చెందిన యువకుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.
రుస్తుంబాదలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టి బైకర్ మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)