ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి జిల్లా) : దశాబ్దాల కాలంగా రెవిన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ తమకు తగినంత వేతనభత్యాలు అందడం లేదని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండల వీఆర్ఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తలపూరి ముత్యాలరావు, సిరికొండ సాయిరామకృష్ణ అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కనీసం టెంట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేక బరకము కట్టుకొని వర్షంలో తడుస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారి డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉoదుర్తి పెద్ద రెడ్డియ్య, వెంకట్రావు, సత్యనారాయణ, అమ్మిరెడ్డి, పద్మారావు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
వర్షంలోనూ .. వీఆర్ఏ ల రిలే నిరాహార దీక్షలు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)