ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖతార్‌లో బంగ్లాదేశ్‌ వైమానిక దళ మాజీ చీఫ్‌ అరెస్ట్‌

1 గంట క్రితం

air force chief
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢాకా : బంగ్లాదేశ్‌ వైమానికదళం మాజీ చీఫ్‌ షేక్‌ అబ్దుల్‌ హన్నన్‌ అరెస్టయ్యారు. స్వదేశంలో ఆయనపై నమోదైన అవినీతి ఆరోపణల కేసులో ఖతార్‌లో అరెస్టయినట్లు సంబంధిత వర్గాలు ఆదివారం తెలిపారు. పదవీ విరమణ చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆదాయ వనరులకు మించి 3.28 కోట్ల బంగ్లాదేశీ టాకాల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారని, అలాగే తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా 27.63 కోట్ల టాకాల విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిపారని బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ఎసిసి) తెలిపింది. హన్నన్‌ను అక్టోబర్ 15న ఖతార్ అధికారులు అరెస్టు చేశారని ఎసిసి డిప్యూటీ డైరెక్టర్‌ మహ్మద్‌ అక్తరుల్‌ ఇస్లాం పేర్కొన్నారు. ఇంటర్‌పోల్ నుండి వచ్చిన ఒక ఇమెయిల్ ద్వారా ఈ అరెస్టు గురించి అవినీతి నిరోధక సంస్థకు అధికారికంగా తెలియజేశారని అన్నారు.

గత ఏడాది జూలైలో అవినీతి నిరోధక కమిషన్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేయడానికి కమిషన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హన్నన్ భార్య కూడా నిందితురాలు. ఆమె తన భర్త సహాయంతో, ఆదాయ మార్గాలకు మించి రూ. 1.91 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె పేరు మీద ఉన్న 32 బ్యాంకు ఖాతాల ద్వారా రూ. 1.18 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను జరిపినట్లు ఎసిసి గుర్తించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్