ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

13 ఏళ్ళ తర్వాత ఎన్నికలు

52 నిమిషాల క్రితం

Elections after 13 years
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 05:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేటపాలెం (బాపట్ల) : స్థానిక సంస్థలకు సాధారణంగా ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు కొలువుదీరి గ్రామాభివృద్ధి, నిధుల వినియోగం పై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పాలక వర్గాల పదవీకాలం ముగిస్తే కొన్ని నెలల పాటు ప్రత్యేకాధికారుల పాలన సాగుతుంది. కానీ ఇక్కడి పరిస్థితి వేరుగా ఉంది.2018 లో పంచాయితీలు 2019 లో మండల పరిషత్ పాలక వర్గాల పదవీకాలం ముగిశాయి. రెండేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకాధికారుల పాలనలో స్థానిక సంస్థల పాలన సాగించిన ప్రభుత్వం 2021 లో స్థానిక ఎన్నికలు నిర్వహించింది. ఇక్కడ మాత్రం ఎన్నికలు జరగక ఎనిమిదేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో నెట్టుకొస్తున్నారు. దీనికి కారణం గ్రామాల పునర్వ్యవస్థీకరణ పేరుతో అప్పట్లో తీసుకున్న అనాలోచిత నిర్ణయం.కొన్ని పంచాయతీలలో ఆవాస ప్రాంతాలను కలిపి ఒక పంచాయతీగా చేయడం, ఒక పంచాయతీలో ఉన్న జనావాసాలు మరో పంచాయితీలో విలీనం చేయడం వంటి నిర్ణయాలపై కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించారు.దీంతో మండలం యూనిట్ గా జరిగే జడ్పీటీసీ ఎన్నికలు, కోర్టు కేసుల పరిధిలోకి రాని రామన్నపేట పంచాయితీ ఎన్నికలు మాత్రమే నిర్వహించారు. మిగిలిన ఎనిమిది గ్రామపంచాయితీ లతో పాటు ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి.పాలకవర్గాలు లేని కారణంగా ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇతరత్రా సమకూరే ఆర్థిక ప్రయోజనాలు ఆగిపోయి అభివృద్ధి నిలిచిపోయింది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల పునర్వ్యవస్థీకరణ ఆదేశాలను రద్దు చేసి,కోర్టు కేసులను ఉపసంహరించుకోవడంతో మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. ఎంపీటీసీ లకు నవంబర్ 3న, పంచాయతీలకు డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్