ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : వెదురు బొంగులను అక్రమంగా తరలిస్తున్న ఆటోలను బుధవారం అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ... నంద్యాల జిల్లాలోని అహోబిలం నుంచి పులివెందులకు వెదురు బొంగులను అక్రమంగా ఆటోల్లో తరలిస్తున్నట్లు చెప్పారు. నాలుగు రోడ్ల కూడలిలో వెదురు బొంగులు తరలిస్తున్న మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్ఆర్ఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
వెదురుబొంగుల ఆటోలు స్వాధీనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 03:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)