ప్రజాశక్తి- కవిటి
బిఎస్ఆర్ డిగ్రీ, జూనియర్ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ బుధవారం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో అడుగుపెట్టిన నూతన విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతోపాటు, సీనియర్ విద్యార్థులతో స్నేహభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ పి.కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ కళాశాల విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఫ్రెషర్స్ డే వేడుకలతో కళాశాల ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ముకుందరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జె.సుబ్బారావు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్లు (0)