న్యూఢిల్లీ : అయోధ్య రామాలయం చోరీ ఆరోపణలపై వార్తలు ప్రచురించిన జర్నలిస్ట్కి అరెస్టు నుండి పూర్తి రక్షణ కల్పిస్తామని సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. రోడ్ రేజ్ కేసు మరియు ఇతర ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు, అరెస్టు నుండి స్వతంత్ర జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయకు లభించిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జర్నలిస్ట్ అరెస్టుపై స్టే విధిస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. రోడ్ రేజ్ ఎఫ్ఐఆర్ను ఉపాధ్యాయ ఏ కారణంతోనైనా సవాలు చేయవచ్చని ధర్మాసనం పేర్కొంది.
అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం, అవకతవకలపై ఉపాధ్యాయ ఆన్లైన్లో పలు పరిశోధనాత్మక కథనాలను ప్రచురించారు. ఆగస్టు 25, సెప్టెంబర్ 7 తేదీల్లో జారీ చేసిన తన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు ఖరారు చేసింది. జర్నలిస్టును అరెస్టు నుండి రక్షించడంతో పాటు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. రోడ్ రేజ్ ఎఫ్ఐర్ కాపీని పిటిషనర్కు అందించినట్లు పేర్కొంది. డిజిటల్ పరికరాలను సమర్పించాల్సిందిగా పోలీసులసు అతనికి జారీచేసిన నోటీసును కూడా కోర్టు నిలిపివేసింది.







కామెంట్లు (0)