అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం కడప నగర కమిటీ నిరసన
ప్రజాశక్తి-కడప అర్బన్: భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. శనివారం కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాల భద్రత వంటి అంశాల్లో ఎన్నికల కమిషన్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా, స్వతంత్రంగా పనిచేయాలని వారు అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్, అన్వేష్, శ్రీనివాసులు రెడ్డి, దస్తగిరిరెడ్డి, చంద్రారెడ్డి, కుమారస్వామిరెడ్డి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, నరసింహ, గోపాలకృష్ణయ్య, రఘు, సుమంత్, రాజమణి, సరిత, అఖిలేష్, విజయ్, అన్వర్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)