ప్రజాశక్తి-కొండాపురం: మండల కేంద్రమైన కొండాపురం పట్టణంలో ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణంలో నుండి జాతీయ రహదారి వెళుచుండటంతో పట్టణంలోని ప్రజల సౌకర్యార్థము జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయడమైనది.. కానీ ఆర్టీసీ యాజమాన్యం వారు మాత్రము ప్రజల సౌకర్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సర్వీస్ రోడ్డు పై వెళ్ళవలసిన బస్సులు. జాతీయ రహదారి పైననే వెళుతున్నాయి. ఈ విధంగా జాతీయ రహదారిపై బస్సులు వెళ్లడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రజలు సర్వీసు రోడ్డుకు జాతీయ రహదారికి మధ్యన నిలబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సుల కోసము ఎదురు చూడవలసి వస్తున్నది. ఆ సమయంలో గ్రామంలో నుండి జాతీయ రహదారిపైకివచ్చే వాహనాల వలన ప్రయాణికుల ప్రాణాలకు ఇబ్బంది కలిగించే అవకాశం లేకపోలేదు. ఈ విషయం అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలేదు. ప్రజలు ప్రాణాలకు ముప్పు వాటిల్లింది ముందే ఆర్డిటీసీ యాజమాన్యం, అధికారులు, మేనేజర్లు కఠిన నిబంధనలను విధించి కొండాపురం పట్టణంలో సర్వీసు రోడ్డుపై అన్ని బస్సులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సర్వీస్ రోడ్డుపై బస్సులు నడపండి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 01:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)