ప్రజాశక్తి - మామిడికుదురు : దీర్ఘకాల సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీ విఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మామిడికుదురు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వి ఆర్ ఎ లు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారది లా పనిచేస్తూ ఎన్నో ఏళ్లు నుంచి విధులు నిర్వహిస్తున్నామన్నారు. పెరిగిన ధరలతో తమ కుటుంబాల జీవనానికి సరిపడే వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపద్యo లో అందుతున్న పదివేల వేతనంతో కుటుంబ జీవనం భారంగా మారిందన్నారు. పే స్కలు అమలు చేయాలని, నామినీ గా విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, ప్రస్తుతం ఉన్న 30% ప్రమోషన్ కోటాను 70 శాతానికి పెంచి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు విధి నిర్వహణలో మరణించిన విఆర్ఏ కుటుంబాలు వీధిన పడకుండా కారుణ్య నియామకాలు చేపట్టి బాధిత కుటుంబాలకు ప్రభుత్వము భరోసా కల్పించాలని కోరారు. తమ న్యాయపరమైన సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంలు మా పరిస్థితిని అర్థం చేసుకుని మానవతా దృక్పథముతో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వి ఆర్ ఎ ల సమ్మెకు కార్యాలయ సిబ్బంది మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు. ఈ సమ్మెలో సంఘ నాయకులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాల సమస్యలు పరిష్కారం కోరుతూ విఆర్ఏల సమ్మె
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 01:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)