బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న తొలి తమిళ సినిమా

1 గంట క్రితం

maharaaja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 01:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న తొలి తమిళ సినిమాగా ‘మహారాజ’ రికార్డు సృష్టించింది. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి, ఆయన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్‌ స్టూడియోస్‌’ ‘మహారాజ’ను రీమేక్‌ చేయనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్‌ రీమేక్‌లో విజయ్‌ సేతుపతి పోషించిన పాత్రను ఆస్కార్‌ విజేత, హాలీవుడ్‌ స్టార్‌ హీరో మాథ్యూ మెక్‌కోనహే పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. విజయ్‌ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన ‘మహారాజ’ తమిళం, తెలుగుతో పాటు చైనాలోనూ విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంతో విజయ్‌ సేతుపతికి ఉత్తమ నటుడిగా పలు అవార్డులు లభించాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్