సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బోరు మోటర్ తీస్తుండగా విద్యుత్ షాక్

1 గంట క్రితం

current shock
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 08:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వ్యక్తి మృతి

ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం : కౌలు రైతు సాగు పొలంలోని ట్రాక్టర్ ఆపరేటర్ దుగ్గినేని రమణయ్య (45) సోమవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరెడ్డిపల్లి గ్రామంలో ఒక కౌలు రైతు సాగు పొలంలోని బోరు మోటర్ చెడిపోవడంతో దానిని బయటకు తీసేందుకు మోటర్లు వెలికితీసే టవర్ వాహనాన్ని రమణయ్య తీసుకువచ్చారు. మోటర్‌ను బయటకు తీసే సమయంలో టవర్ విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ఘటనలో దుగ్గినేని రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బోరు పీకే ట్రాక్టర్ యజమాని పెసల నాగేశ్వరరెడ్డి విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఘటనలో రాజేంద్ర ప్రసాద్ అనే హెల్పర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్