శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్యోతుల పాపారావు సాగునీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపి

1 గంట క్రితం

nda mp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - జగ్గంపేట : స్థానిక మండలంలోని మామిడాడ వద్ద రూ. 3.82 లక్షలతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకాన్ని ఎంపి సానా సతీష్ బాబు శనివారం ప్రారంభించారు. స్థానిక ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రుతో కలిసి ఆయన ఈపథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతం సస్యశ్యామలం చేసేందుకు ఎమ్మెల్యే జ్యోతుల అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ సాగునీటి పథకం ద్వారా 5 గ్రామాల్లోని 3500 ఎకరాలకు ప్రయోజనం కలుగనుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి తుమ్మలపల్లి రమేష్, పుష్కర చైర్మన్ అడబాల భాస్కరరావు, ఏఎమ్ సి చైర్మన్ అడపా భరత్, టిడిపి నాయకులు ఎస్ .వి.ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోలవరం ఎడమ కాలువ ఈఈ దేవర శ్రీనివాసులు, డిఈ వి.ప్రసాద్, ఎఇఇ వంశీధర్, ఇతర నేతలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్