శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బాపట్లలో భారీ చోరీ.. రూ.35 లక్షల నగదు అపహరణ

1 గంట క్రితం

baapatla
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 05:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వేటపాలెం : మండలంలోని కటారిపాలెంలో శనివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కటారి నరసింహులు ఇటీవల తనకున్న 50 సెంట్ల పొలాన్ని విక్రయించగా రూ.1.32 కోట్లు వచ్చింది.తన ఐదుగురు కుమార్తెలలో నలుగురు కుమార్తెలకు తలో రూ.20 లక్షల చొప్పున అందజేసి, మరికొంత నగదు అప్పులు తీర్చగా మరో కుమార్తె కు ఇవ్వాల్సిన రూ.20లక్షలు తో కలిసి సుమారు రూ.35 లక్షల నగదును ఇంట్లోని ట్రంకు పెట్టెలో భద్రపరిచారు. మరో పొలం కొనుగోలు చేసేందుకు ఆ నగదును ఉంచినట్లు బాధితుడు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ట్రంకు పెట్టెను పగులగొట్టి అందులో ఉన్న రూ.35 లక్షల నగదును అపహరించి,అనంతరం ట్రంకు పెట్టెను ఇంటికి సమీపంలో పడేసి వెళ్లినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న చీరాల రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి దొంగల ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్