ప్రజాశక్తి -టెక్కలి: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా పరిధిలో అత్యుత్తమ సేవలు అందించినందుకు టెక్కలి 108 సిబ్బంది శ్రీనివాస్ బెహరాకు ఉత్తమ ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) అవార్డు లభించింది. అత్యవసర సమయాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో శ్రీనివాస్ బెహరా చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా 108 జిల్లా అధికారులు, సహచర సిబ్బంది శ్రీనివాస్ బెహరాను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
టెక్కలి 108 సిబ్బందికి ప్రశంసా పత్రం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)