1,176 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు
ప్రజాశక్తి-పోరుమామిళ్ల రూరల్(కడప) : పోరుమామిళ్ల మండలం చిన్నయరసాల ఎంపీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సురే రవి విజయం సాధించారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు 1,373 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి పాలకొలను హర్షవర్ధన్‌కు 197 ఓట్లు, జనసేన అభ్యర్థి గంధంశెట్టి చంద్రహాస్‌కు 179 ఓట్లు పోలయ్యాయి. దీంతో సురే రవి 1,176 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. విజయం అనంతరం సురే రవి మాట్లాడుతూ తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించిన చిన్నయరసాల గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఆయన గెలుపుతో అనుచరులు గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.







కామెంట్లు (0)