ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుంతలమయంగా ఆర్టిపిపి రోడ్డు

50 నిమిషాల క్రితం

RTPP road riddled with potholes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 04:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు


ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : ముద్దనూరు నుంచి ఆర్టిపిపి వరకు ఏర్పాటు చేసిన రహదారిలోని రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముద్దనూరు నుంచి ఆర్టిపిపి మీదుగా ప్రొద్దుటూరు వెళ్లేందుకు పులివెందుల,కొండాపురం, ముద్దనూరుకు చెందిన వాహనదారులు,ప్రయాణికులు బైకులు,కార్లలో ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు.ఈ మార్గంలో ప్రయాణించేందు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నాణ్యత లేక పోవడంతో పాడై పోయి కంకర బయటికి వచ్చి గుంతలు ఏర్పడ్డాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రమాదవశాత్తు వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరగక ముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు,ప్రయాణికులు,వాహనదారులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్