ఎస్సై నచ్చినవారికి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీలు
పోలీస్ స్టేషన్లోనే విందు - రాజకీయం నడిపిన ఎస్ఐ సురేంద్రబాబు
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలో నిర్వహిస్తున్న ఎంపిటిసి స్థానాల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులకు ఎస్సై పోలీస్ స్టేషన్ లోనే మూడు రోజులు మటన్ చికెన్ విందు రాజకీయం నడిపించారు. శుక్రవారం రాత్రి బస చేసిన మిగతా పోలీస్ సిబ్బందికి అన్నం కూడా పెట్టలేని దుస్థితి వచ్చిందంటే ఇక్కడ ఎస్సై ఎలా విధులు నిర్వహిస్తున్నారు అర్థమవుతుంది. వచ్చిన సిబ్బంది ఎస్సై కి సహకరించిన కొంతమంది పోలీసులకు గత మూడు రోజుల నుండి విందు రాజకీయం స్టేషన్లో నడిపిస్తున్నారు. ఇది బయటపడడంలో కొంతమంది పోలీసులకు తనకు నచ్చిన పోలీస్ వారికి మటన్, చికెన్ తీసుకొచ్చి పెట్టి మిగిలిన వారికి పప్పు అన్నం కూడా పెట్టలేదని బందోవస్తుకు వచ్చిన ఒక ఎస్ఐ శనివారం ప్రజాశక్తి విలేక రీ తో మాట్లాడుతూ మా సిబ్బందికి మీ ఎస్సై శుక్రవారం రాత్రి భోజనాలు కూడా పెట్టలేదని ఇది ఎక్కడ పుట్టూరు స్టేషన్ అని అడగడం జరిగింది. దీన్నిబట్టి చూస్తే ఎస్ఐకి సహకరిస్తే విందు భోజనాలు సహకరించని వారికి ఉపవాసాలు పెట్టిన ఘనత పుట్లూరు ఎస్ఐకే దక్కుతుంది. ఎన్నికల బందోబస్తు వచ్చిన పోలీస్ వారికి రాత్రి బస చేస్తే వారికి భోజనాలు టిఫిన్ పెట్టించేందుకుగాను ఖర్చులకు పైనుంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ వచ్చినా కూడా బందోబస్తు వచ్చిన పోలీస్ వారికి భోజనాలు పెట్టకుండా పచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అని బందోవస్తుకు వచ్చిన పోలీసుల గుసగుసలాడు కోవడం జరిగింది.







కామెంట్లు (0)