ప్రజాశక్తి-రాజంపేట (కడప) : రాజంపేట పట్టణానికి చెందిన జనసేన పార్టీ మీడియా కోఆర్డినేటర్ చింతల శివ ఆదివారం అర్ధరాత్రి తిరుపతి నగరంలోని తన బంధువుల ఇంటిలోని బాత్ రూమ్ లో ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాసరాజు పార్టీ కార్యాలయంలో విధులు నిర్వహించేవారు. సౌమ్యుడిగా రాజంపేటలో అందరికీ సుపరిచితుడైన చింతల శివ మృతి పట్ల అటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
జనసేన మీడియా కోఆర్డినేటర్ అనుమానాస్పద మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 05:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)