గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'ఆస్మాన్` టీజర్ విడుదల

17 గంటల క్రితం

aasmaan-teaser-sep1626.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. మేఘాంశ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం చిత్రయూనిట్ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. “మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు. అదే నిజం” అంటూ హీరో చెప్పే వాయిస్ ఓవర్‌తో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్‌నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రాయంచ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కొండారు వెంకటేష్, మన్నెం శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, అరబిక్ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్