మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నూతన సంవత్సరానికి ‘అసరీరి’

1 గంట క్రితం

నూతన సంవత్సరానికి ‘అసరీరి’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 06:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అసరీరి’. ‘96’, ‘జాను’, ‘మేయళగన్‌’ చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శివద, చేతన్‌, గీత, హరీష్‌ ఉత్తమన్‌, కరుణాకరన్‌, శరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్నారు. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, మాన్‌సూన్‌ మూవీస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్‌ ఇషారి కె. గణేష్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కేరళలో ఈ సినిమా పంపిణీ హక్కులను భావన రిలీజ్‌ సొంతం చేసుకోగా, తెలుగులో ఎస్‌.ఎస్‌. కార్తికేయ నేతృత్వంలోని షోయింగ్‌ బిజినెస్‌ సంస్థ విడుదల చేయనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్