మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా టాక్ షో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘చిరంజీవీస్ మెగావర్స్’ పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. చిరంజీవి పేరులోని ‘ఎన్’ అక్షరాన్ని తొలగించి ప్రచార కార్యక్రమాల ద్వారా ఆసక్తి రేకెత్తించిన చిత్రబృందం, ఆ అక్షరం నెట్‌ఫ్లిక్స్‌ను సూచిస్తోందనే విషయాన్ని టీజర్లో వెల్లడించింది. చివర్లో చిరంజీవి ‘ఇది నా అడ్డా’ అంటూ కనిపించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సినిమా, క్రీడలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో చిరంజీవి ఆసక్తికర సంభాషణలు చేయనున్నారు. సినీ ప్రయాణంలోని అనుభవాలతోపాటు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను కూడా ఆయన పంచుకోనున్నారు. నవంబరు 30న సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లో షో ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు సమాచారం.
‘మెగావర్స్’ టీజర్ విడుదల
10 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 07:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు





కామెంట్లు (0)