మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆస్కార్‌ బరిలో ‘గొంధల్‌’ మరో ముందడుగు

3 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​భారతీయ సినిమా ఆస్కార్‌ ప్రయాణంలో ‘గొంధల్‌’ మరో కీలక ముందడుగు వేసింది. 2027 ఆస్కార్‌ పురస్కారాల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగానికి భారత్‌ అధికారికంగా ఎంపిక చేసిన ఈ మరాఠీ చిత్రం, అకాడమీ ప్రకటించిన 104 చిత్రాల అర్హత జాబితాలో చోటు సంపాదించింది. తదుపరి దశ అయిన షార్ట్‌లిస్ట్‌ డిసెంబర్‌ 15న ప్రకటిస్తారు. మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సంతోష్‌ దావఖర్‌ దర్శకత్వం వహించారు. సంప్రదాయ ‘గొంధల్‌’ జానపద కళారూపం నేపథ్యంగా ఒక రాత్రిలో జరిగే కథను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. అసంతృప్తికరమైన వైవాహిక జీవితంలో చిక్కుకున్న సుమన్‌ అనే యువతి, ప్రేమ, కోరిక, మోసం, హత్య, మనుగడ చుట్టూ కథ సాగుతుంది. ఇషితా దేశ్‌ముఖ్‌, కిశోర్‌ కదమ్‌ తదితరులు నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించారు. 2025లో జరిగిన 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సిల్వర్‌ పీకాక్‌ అవార్డు లభించింది. భారతీయ చలనచిత్ర సమాఖ్య 33 చిత్రాలను పరిశీలించి ‘గొంధల్‌’ను ఆస్కార్‌కు అధికారికంగా ఎంపిక చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్