మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు

1 గంట క్రితం

Case registered against popular singer Rahul Sipligunj.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో 10 మందిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించారని ఓ యువతి ఆరోపిస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విశాఖలోని ఎంవిపి పోలీసులు రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన దాదాపు రెండు నెలల క్రితం జరగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.


విశాఖకు చెందిన ఓ యువతి ఫిర్యాదు ప్రకారం .... కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఆరోపించారు. అంతేకాదు.. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా జోక్యం చేసుకున్నారని యువతి ఆరోపించారు. రాహుల్ రెడ్డికి బంధువునని చెప్పి, తనను బెదిరించారని, బలవంతంగా కొన్ని వీడియో స్టేట్‌మెంట్లు ఇప్పించారని ఆమె తన ఫిర్యాదులో వివరించారు. యువతి ఫిర్యాదుతో రాహుల్ సిప్లిగంజ్‌తో సహా మొత్తం 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో మధ్యవర్తిత్వం చేసిన కొందరు జర్నలిస్టులు, హైకోర్టు న్యాయవాది కూడా ఉన్నట్లు సమాచారం. తొలుత ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, తదుపరి విచారణ నిమిత్తం దీనిని ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. యువతి ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విష‌య‌మై రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటివరకు స్పందించ‌లేదు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్