మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్త పార్లమెంటు, పిఎం నివాసాన్ని పునరుద్ధరించారు, స్కూల్స్‌ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు: సీజేపీ

1 గంట క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : గ్రామీణ పాఠశాలల నాణ్యతను మెరుగుపరిచేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రకటించింది. ఇందుకోసం, తమ గ్రామాల్లోని పాఠశాలల నాణ్యతను నిర్ధారించుకోవడానికి, వాటి అభివృద్ధి అవసరాల గురించి తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి పాఠశాలల తనిఖీలు నిర్వహించాలని కోరింది.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ, ఈ ప్రచారం స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న మహారాష్ట్రలోని హింగోలి గ్రామంలో ప్రారంభమవుతుందని తెలిపారు. గ్రామీణ పాఠశాలల మౌలిక సదుపాయాల నిర్లక్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రజలు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పరస్పర సహకారం అందించాలని ఆ ప్రకటన పేర్కొంది. "కొత్త పార్లమెంట్, ప్రధానమంత్రి నివాసం నిర్మించారు, మరి పాఠశాల ఎక్కడ?" అనేది ఈ ప్రచార నినాదం. ఈ ప్రచారానికి సంబంధించి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో దీప్కే ఈ ప్రశ్నను లేవనెత్తారు. మనం మన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, కానీ గత ఎనిమిది దశాబ్దాలుగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. రైతులు, కార్మికుల పిల్లలను భావి భారత పౌరులుగా చూడటం లేదా, అందుకే నిర్లక్ష్యం చేస్తున్నారా అని దీప్కే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్