కత్రినాకు మద్దతుగా నటి సోనారికా
ఇంటర్నెట్ : బాలీవుడ్ సినీనటి కత్రినా కైఫ్ ప్రసవానంతరం బరువు పెరిగారంటూ .... సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై నటి సోనారికా భడోరియా స్పందించారు. ప్రసవం తర్వాత మహిళల శరీరంలో చోటుచేసుకునే మార్పులపై వ్యాఖ్యలు చేయడం, ట్రోల్ చేయడం తగదని పేర్కొన్నారు. బిడ్డకు జన్మనివ్వడం చిన్న విషయం కాదని, ఆ సమయంలో మహిళ శరీరం అనేక మార్పులకు లోనవుతుందని ఆమె తెలిపారు. ప్రసవం తర్వాత కోలుకునేందుకు ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుందని చెప్పారు. మహిళ రూపం, బరువు గురించి మాట్లాడటం కంటే.. బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె పడిన కష్టం, బిడ్డ సంరక్షణ కోసం చేస్తున్న త్యాగాలను గుర్తించాలని సూచించారు. ఇలాంటి విమర్శలు కేవలం కత్రినాకే పరిమితం కాలేదని, అనేకమంది మహిళలు ప్రసవం తర్వాత సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారని సోనారికా అన్నారు. మాతృత్వం తర్వాత మహిళల మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు వారిని బాధించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సున్నితంగా వ్యవహరించాలని కోరారు. మహిళలు తమ శరీరంలో వచ్చిన మార్పులకు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని సోనారికా స్పష్టం చేశారు. ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకుని తమను తాము తక్కువగా అంచనా వేసుకోవద్దని సూచించారు.







కామెంట్‌లు (0)