ముంబయి : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కు ముంబయిలోని మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి షాక్ తగిలింది. జుహు ప్రాంతంలోని ఆయన బంగ్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన అదనపు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ముంబయిలోని జుహులో ఉన్న కపోల్ సొసైటీలో అజయ్ దేవగణ్కు సుమారు 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా ఉంది. ఈ భవనంలో గోడల నిర్మాణం, కిటికీల మార్పులు వంటి పనులను ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే చేపట్టారు. దీనిపై గత నెల సెప్టెంబర్ 10 న అధికారులు నోటీసులు జారీ చేసి, పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా పనులు కొనసాగించడంతో, తాజాగా రంగంలోకి దిగిన బీఎంసీ ఆ అనధికార నిర్మాణాలను కూల్చివేసింది.
అక్రమ నిర్మాణాల కూల్చివేత - అజయ్ దేవగణ్ కు బీఎంసీ షాక్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 05:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు





కామెంట్లు (0)