విజయవాడ : కుల సర్టిఫికేట్, పోలీసు కేసు వివరాలు సమర్పించేందుకు గడువు పొడిగించాలని కోరుతూ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం లేఖ రాశారు. నిన్నటి నుండి కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికలకు నామినేషన ప్రక్రియ ప్రారంభమైందని, నామినేషన్లు సమర్పించేందుకు రేపు ఆఖరి తేది అని... వీటిలో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, పోలీసు కేసు వివరాలు సేకరించేందుకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన విధంగా 24 గంటల్లో సంబంధిత శాఖల నుండి ఈ పత్రాలను పొందడంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సమయం తక్కువగా ఉండటంతో కుల ధ్రువీకరణ పత్రం, పోలీసు కేసుల వివరాలు అఫిడవిట్ సమర్పించేందుకు నామినేషన్ల ఉపసంహరణ తేదీ వరకు అవకాశం కల్పించవలసిందిగా కోరారు. సమస్య ప్రాధాన్యత రీత్యా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కుల సర్టిఫికేట్, పోలీసు కేసు వివరాలు సమర్పించేందుకు గడువు పొడిగించాలి : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వి.శ్రీనివాసరావు లేఖ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 05:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)