శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Bail - సిజెపి అధినేత అభిజిత్ దీప్కేకు బెయిల్

1 గంట క్రితం

Bail granted to CJP chief Abhijit Deepke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) అధినేత అభిజీత్‌ దీప్కే కు ఢిల్లీలోని న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం ఢిల్లీలో తిరంగా మార్చ్‌లో పాల్గొనేందుకు కనాట్‌ ప్లేస్‌కు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.


సిజెపి ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా అనుమతి లేకుండా జంతర్ మంతర్ దగ్గర నిరసన చేశారని ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా కు న్యాయస్థానం ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. సౌరవ్ దాస్, ఆశుతోష్ ‎లపై కేసు, అరెస్ట్‎ను నిరసిస్తూ అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‎లో సిజెపి లెహ్రా దో తిరంగా మార్చ్‏కు పిలుపునిచ్చింది. శాంతి భద్రతల కారణాలతో సిజెపి ప్రొటెస్ట్‎కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇందులో భాగంగానే కన్నాట్ ప్లేసులో లెహ్రా దో తిరంగా ర్యాలీ చేపట్టకుండా సిజెపి ఫౌండర్ అభిజిత్ దీప్కేను శుక్రవారం (అక్టోబర్ 16) ఢిల్లీ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో దీప్కేపై బీఎన్ఎస్‎లోని సెక్షన్ 126, 170 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీప్కేను శనివారం (అక్టోబర్ 17) మందిర్ మార్గ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నిర్దేశించిన షరతులతో కూడిన శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దీప్కే విడుదల అవుతారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్