ప్రజాశక్తి-రాజంపేట (కడప) : రోలర్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన కడప నగరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలలో రెయిన్బో స్కూల్ చెందిన యూకేజీ విద్యార్థి యక్కల హుశాంక్ సత్తా చాటి రెండు పతకాలు సాధించాడని స్కూల్ కరప్పాండెంట్ ఎస్.రవీంద్ర నాయుడు తెలిపారు. ఈ పోటీలలో వివిధ విభాగాలలో 130 మంది క్రీడాకారులు పాల్గొనగా ఎక్కడ హుశాంక్ రింక్-1 విభాగంలో రజత పతకం, రింక్-2 విభాగంలో కాంస్య పతకం సాధించాడని తెలిపారు. ఈనెల 31వ తేదీన కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో తమ విద్యార్థి పాల్గొంటాడని, రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ చూపి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, స్కేటింగ్ మాస్టర్ వినోద్ లను పాఠశాల సిబ్బంది, అకాడమిక్ డీన్ ప్రత్యేకంగా అభినందించారు.







కామెంట్లు (0)