సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సోదరి అంబిక, సోదరుడి పై సినీనటి రాధ ఫిర్యాదు

1 గంట క్రితం

Film actress Radha files complaint against brother; sister Ambika involved.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : సీనియర్ హీరోయిన్ రాధ కుటుంబంలో వివాదం నెలకొంది. తన చెక్‌ లను దుర్వినియోగం చేశారని రాధ ఆరోపిస్తూ చెన్నై కోర్టును ఆశ్రయించారు. తన సోదరి అంబిక, సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్‌ పై గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌ కు రాధ ఫిర్యాదు చేశారు. తాను సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించారని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన చెక్‌లను దొంగిలించి దాదాపు రూ. 46 కోట్ల మోసానికి పాల్పడ్డారని రాధ ఆరోపించారు. తన సోదరుడు మల్లికార్జున, తన సోదరి అంబిక కలిసి ఈ పని చేశారని రాధ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు.. తన ప్రమేయం లేకుండా తన గది నుంచే ఆ చెక్కులను తీసుకున్నారని ఆరోపించారు. తాను ఆ చెక్కులను తన సోదరికి ఎప్పుడూ ఇవ్వలేదని.. వెంటనే చెల్లింపులను నిలిపివేయాలని బ్యాంకు అధికారులకు సూచించినట్లు రాధ వెల్లడించారు. అంతేకాకుండా విలువైన వస్తువులు, నగలు, ఆస్తి పత్రాలు, ఇతర రికార్డులు ఉంచిన తన ఆస్తి భాగాన్ని తీసుకోనీయకుండా అంబిక, మల్లికార్జున తనను అడ్డుకున్నారని కూడా రాధ ఆరోపించారు. విచారణ జరిపి వారిద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్