సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో పర్యటించనున్న జిన్‌పింగ్‌

1 గంట క్రితం

Jinping
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : చైనాఅధ్యక్ష‍ుడు జిన్‌పింగ్‌ అమెరికా పర్యటన ఖరారైంది. సెప్టెంబర్‌ 23-25 తేదీల మధ్య జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ సోమవారం స్పష్టం చేసింది. ఇరువురు నేతలు ప్రధాన అంశాలైన ప్రపంచశాంతి, అభివృద్ధితో పాటు చైనా-అమెరికాల మధ్య సంబంధాలపై సుదీర్ఘ చర్చలు జరపనున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి గుయో జియాకున్‌ తెలిపారు. చైనా, అమెరికాల మధ్య నిర్మాణాత్మక, వ్యూహాత్మక స్థిరత్వ సంబంధాలను సుసంపన్నం చేయడానికి, చర్చలు, సహకారాన్ని బలోపేతం చేయడానికి, విభేదాలను సమర్థవంతంగా పరిష్కరించుకోవడానికి చైనా అమెరికాతో కలిసి పనిచేస్తుందని అన్నారు.

ఈవారంలో జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటించనున్నారని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో ట్రంప్‌, జిన్‌పింగ్‌కు వ్యక్తిగతంగా స్వాగతం పలుకుతారని అమెరికా అధికారి ఒకరు ధృవీకరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్