ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : రాష్ట్ర విఆర్ఏల సంఘం(జేఏసీ) పిలుపుమేరకు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండల విఆర్ఎ లు తమ కనీస అవసరాలకు సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ ఆరవ రోజు సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు నేతలు దడాల చందర్రావు, జల్లి వెంకట్రావు, సిపిఐ నేత కొండే రామకృష్ణ, తదితరులు వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపారు. అలాగే వీఆర్ఏల యొక్క న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల విఆర్ఎల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు తాతపూడి ఇసాక్, భువనగిరి ఏసు, కార్యదర్శి కాంతేటి శివరామారావు లు మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా రూ.10,500 వేతనంతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ లందరికీ తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని, నామినీగా పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ వీఆర్ఎలుగా నియమించాలని, అర్హులైన వీఆర్ఎ లందరికీ 70 శాతం పదోన్నతి కల్పించాలని, మరణించిన వీఆర్ఎ కుటుంబాలలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం ఇవ్వాలని, పేద ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని కోరారు. వీఆర్ఏల శాంతియుత ధర్నాను ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మె చేయడం తప్పదని వారన్నారు. ఈ కార్యక్రమంలో సలహాదారు గూనపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి కుందేటి శ్రీను, సభ్యులు సిద్దిల చంటిబాబు, తదితర విఆర్ఎలు పాల్గొన్నారు.
విఆర్ఎల సమ్మెకు మద్దతు తెలిపిన మాల మహానాడు, సిపిఐ
45 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)