ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల పరిషత్ కార్యాలయంలో ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఎంపీడీవో ఏ.రాజు, తహసిల్దార్ కందుల కుశరాజు ల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వారంతా గురజాడ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు గా పేర్కొన్నారు. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననాలు పొందుతున్నాయన్నారు. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారన్నారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయన్నారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు అన్నారు. అతనికి కవి శేఖర అనే బిరుదు ఉందన్నారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని తన కవితలతో ఎలుగెత్తి సాటిన మహాకవిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, ఎంఈఓ అప్పాజీ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ వలీ, ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి దేవి, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గురజాడ అప్పారావు జయంతి
48 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)