బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionట్రోల్స్‌ను పట్టించుకోను: ఏఆర్‌ రెహమాన్‌

19 గంటల క్రితం

ట్రోల్స్‌ను పట్టించుకోను: ఏఆర్‌ రెహమాన్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 06:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ‘మంగళ్‌ రంగ్‌’ పాటపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ‘ఖవాలీ’, ‘ఛావా’ చిత్రాల్లోని పాటల తరహాలోనే ఈ పాట ఉందని, కొత్తదనం లేదని కొందరు రెహమాన్‌ను ట్రోల్‌ చేశారు. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. “మొదట్లో ఈ పాటలను విమర్శించిన వారే తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుని క్షమాపణలు చెబుతున్నారు. నేను ట్రోల్స్‌, విమర్శలను పెద్దగా పట్టించుకోను. ఒక పాటకు సంగీతం అందించే క్రమంలో ఎన్నో మార్పులు చేస్తూ కష్టపడతాం. పలుమార్లు విని సంతృప్తి చెందిన తర్వాతే పాటను విడుదల చేస్తాం. అప్పటికే కామెంట్లు చూసే శక్తి కూడా నాకుండదు. నిన్న విమర్శించిన వాళ్లే రేపు క్షమాపణలు అడుగుతారని నా కొడుకు నాతో అంటుంటాడు. నేను మాత్రం నా పనిని నిజాయితీగా వందశాతం పూర్తి చేయడంపైనే దృష్టి పెట్టాను” అని రెహమాన్‌ తెలిపారు. కాగా, ‘రామాయణ’ తొలి భాగం నవంబర్‌ 5న భారత్‌లో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్