బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఝాన్సీ రాణి అనే నేను...

1 గంట క్రితం

ఝాన్సీ రాణి అనే నేను... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 07:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాగార్జున వందో చిత్రం ‘కింగ్‌ 100’లో టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా బుధవారం చిత్రబృందం పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో ‘మనుషుల్లో రెండు రకాలు.. కష్టాన్ని నమ్మేవాళ్లు, లక్‌ను నమ్మేవాళ్లు. మహంతి ఝాన్సీ రాణి అనే నేను..’ అంటూ టబు చెప్పిన సంభాషణ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్‌పై నాగార్జున కూడా స్పందించారు. ‘నిన్నే పెళ్లాడతా’లో పండు పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరని, ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణిగా టబు మరోసారి గుర్తుండిపోతారని అభిప్రాయపడ్డారు. ఈసారి కథ ప్రేమకు మించినదని పేర్కొంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రా. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్