ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Maheshbabu Birthday - క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోతో నమ్రత పోస్ట్‌..

2 గంటల క్రితం

Mahesh Babu's Birthday – Namrata's post featuring a cute family photo...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 12:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : నేడు టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా .... సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో సందడి నెలకొంది. వారణాసి లుక్‌తో రాజమౌళి విషెస్‌ చెప్పగా.. స్టార్‌ నటీనటులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన భార్య నమ్రత క్యూట్‌ ఫ్యామిలీ ఫొటోను పంచుకుని భర్త కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.



‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు MB. మా ప్రతిరోజునూ ఇంత ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్‌ యూ సో మచ్‌’’ - నమ్రత శిరోద్కర్‌

‘‘మహేష్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో విజయాలు సాధిస్తూ.. ప్రేక్షకులను మెప్పించాలి. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ - పవన్‌ కల్యాణ్‌

‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. ‘వారణాసి’తో అద్భుతమైన సాహసయాత్రను ప్రారంభించినందుకు కంగ్రాట్స్‌’’ - ప్రియాంక చోప్రా

photo

‘‘హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ మహేష్. ఇండస్ట్రీలో ఎంతోమంది నిన్ను ప్రేమిస్తూ.. ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. అగ్రకథానాయకుల్లో ఒకరిగా నువ్వు ఎదగడం ఎంతో సంతోషం’’ - చిరంజీవి

‘‘నా చిన్నోడు మహేష్ ‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. రుద్ర చాలా గంభీరంగా, అందంగా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది ‘వారణాసి’తో నువ్వు ప్రపంచాన్ని జయించబోతున్నావు. ఈ క్షణాలను చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ - వెంకటేశ్‌

‘‘నువ్వు సూపర్‌ స్టార్‌ మాత్రమే కాదు. ఒక హీరోగా లక్షల మందికి నువ్వు ఓ ఎమోషన్‌. పుట్టినరోజు శుభాకాంక్షలు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు. మరెన్నో మ్యాజిక్‌లు క్రియేట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ - నారా రోహిత్


mahesh babu


హీరో మహేష్ ప్రయాణంలో విజయాలతో పాటు కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోని సినిమాలు వచ్చినా.. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ తనను తాను మరింత మెరుగుపరుచుకున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ .... తన ఇమేజ్‌ను క్రమంగా విస్తరించుకున్నారు. ఇదే ఆయనను టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్టార్‌గా నిలబెట్టింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు కెరీర్‌లోనే మరో భారీ అధ్యాయం మొదలైంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ స్థాయి కథ, భారీ విజువల్స్, రాజమౌళి మార్క్ మేకింగ్‌తో ‘వారణాసి’ మహేష్‌ను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు మరింత చేరువ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు నెక్స్ట్ లెవల్ ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది.
mahesh babu 033


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్