గిరిజనుల హక్కులు చట్టాలు పరిరక్షణకై, జీవో నెంబర్ 3,1/70 యాక్ట్ పటిష్ట అమలుకై ఆదివాసి దినోత్సవ స్ఫూర్తితో భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలి.
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు పిలుపు.
ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాటిన గిరిజనులు భారీ ర్యాలీ.
గిరిజన సాంప్రదాయాలు ఉట్టి పడేలా విద్యార్థుల కళా ప్రదర్శన.
రాజవొమ్మంగిలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు.
స్ఫూర్తి నింపిన గిరిజన నాయకుల ఉపన్యాసం.

ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో రాజవొమ్మంగిలో ఆదివారం పలు ఆదివాసీ గిరిజన సంఘాలు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. అల్లూరి జంక్షన్ వద్ద పెద్ద సంఖ్యలో ఆదివాసీలు మానవహారంగా చేపట్టి గిరిజనుల హక్కులు చట్టాల కోసం, ఐక్యత కోసం బిగ్గరగా నినదించారు. ఆదివాసీ సాంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా గిరిజన వేషధారణలో, ఆట,పాటలతో, నృత్యాలతో విద్యార్థులు అలరించారు. తొలిత స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఆదివాసి జెండాను ఆదివాసీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. అలాగే స్థానిక ఆరెందుకు గృహం వద్ద ఏర్పాటు చేసిన ఆదివాసి దినోత్సవ బహిరంగ సభలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు,పలు ఆదివాసి సంఘాల నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధులు,ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులు గోము వెంకటలక్ష్మీ, వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, సింగిరెడ్డి అచ్చారావు, వజ్రపు అప్పారావు, గంపా నాగరాజు,కొండ్ల సూరిబాబు,బొడారపు కృష్ణ,నరేష్,కొంగర మురళికృష్ణ,తదితరులు మాట్లాడారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణతో,బాటు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు గిరిజనులను మాయమాటలు చెప్పి మోసగిస్తున్నారని, ఏజెన్సీ అభివృద్ధి పేరుతో ఏజెన్సీ వనరులను కొల్లగొడుతున్నారని,గిరిజనుల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కార్పొరేట్ శక్తులకు ధారాధత్వం చేస్తున్నారని విమర్శించారు. జీవో నెంబర్ 3 కోల్పోవడం వలన ఉద్యోగ అవకాశాలు గిరిజనలు కోల్పోయారని,నేడు 1/70 యాక్ట్ కి కూడా ప్రమాదం పొంచి ఉందని దీనిని తెలుసుకొని గిరిజనులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు ఉద్యోగ,ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు గొల్లపూడి పెద్దిరాజు,పాండవుల సత్యనారాయణ,కుంజం జగన్నాథం,వెంకట లక్ష్మీ,పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు,పలు పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)