హీరో వైభవ్ అయ్యప్ప స్వామి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికంఠ’. మలయాళంలో విజయవంతమైన ‘మాలికాపురం’ చిత్రాన్ని తెరకెక్కించిన విష్ణు శశి శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో మీనాక్షి గోవిందరాజన్, అరవింద్ ఆకాష్, జె.కె. శరవణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లు సమాచారం. కార్తీకమాసంలో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తంత్ర ఫిల్మ్స్ పతాకంపై జె.కె. శరవణ, ఎం. రాజారాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Print Edition‘మణికంఠ’ ఫస్ట్‌లుక్ విడుదల
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 07:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)