ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సినీనటుడు రమేష్ కుటుంబానికి అండగా మెగాస్టార్ చిరంజీవి

2 గంటల క్రితం

Megastar Chiranjeevi stands by film actor Ramesh's family.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతోపాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే స్పందించారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి... చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన .... చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఆయన సతీమణి కి తన తరఫున రూ.3 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని రమేష్ కుటుంబ సభ్యులకు చిరంజీవి హామీ ఇచ్చారు. అలాగే నిన్న నాగబాబు మరో రూ. 2 లక్షల చెక్కును అందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. తోటి కళాకారుల పట్ల చిరంజీవి ఎప్పటినుంచో చూపిస్తున్న ఆప్యాయత, ఆత్మీయత, బాధ్యతాభావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. ఎన్నో సందర్భాల్లో అవసరంలో ఉన్న సినీ కార్మికులు, నటీనటులకు ఆయన అందించిన సహాయం పరిశ్రమలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సినీనటుడు రమేష్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్