ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కింగ్ కోబ్రా అయితే ఏంటి ? తగ్గేదెలే..! - సూపర్ పిల్లి ..!

1 గంట క్రితం

So what if it's a King Cobra? Not backing down! — Super Cat!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇంటర్నెట్ : సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాము, ముంగిసల మధ్య హోరాహోరీ పోరు జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఎప్పుడైనా కింగ్ కోబ్రాతో ఓ చిన్న పిల్లి ముఖాముఖి తలపడటం చూశారా ? వినడానికే కాస్త వింతగా అనిపించినా.. తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తనను కాటు వేయడానికి విరుచుకుపడిన విష సర్పానికి పిల్లి చుక్కలు చూపించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


భయపడటం పక్కనబెట్టి.. ఎదురుదాడికి.. !

ఘర్ కే కలేష్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టయిన ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒక బహిరంగ ప్రదేశంలో కింగ్ కోబ్రా, పిల్లి ముఖాముఖి ఎదురవుతాయి. పిల్లిని చూడగానే కింగ్ కోబ్రా తన పడగ విప్పి, భయపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. సాధారణంగా అంత పెద్ద విష సర్పం కనిపిస్తే ఏ జీవి అయినా పరుగులు తీస్తుంది. కానీ ఆ పిల్లి మాత్రం ఎక్కడా భయపడకుండా చాలా ప్రశాంతంగా, ధైర్యంగా పాము ముందే కూర్చుండిపోయింది. కింగ్ కోబ్రా ఒక్కసారిగా పిల్లిపై దాడి చేయడానికి ముందుకు రాగా, పిల్లి మెరుపు వేగంతో ఆ కాటు నుంచి తప్పించుకుంది. అంతటితో ఆగకుండా తన పంజాతో పాముపై ఎదురుదాడి చేస్తూ దాన్నే బెదిరించడం మొదలుపెట్టింది. పిల్లి ధైర్యానికి ఆ విష సర్పమే తోకముడిచి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.


నెటిజన్ల ఫన్నీ కామెంట్లు – వైరల్ వీడియో.. !

ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఇప్పటికే ఈ వీడియోను 48 వేలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ క్లిప్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాము కంటే పిల్లి రిఫ్లెక్సెస్ చాలా ఎక్కువ అని ఈ వీడియో నిరూపించింది. అని ఒకరు కామెంట్ చేయగా.. ఏ పరిస్థితిలోనూ పిల్లిని తేలికగా తీసుకోకూడదురా బాబోయ్ అని మరొకరు సరదాగా వ్యాఖ్యానించారు. విషసర్పంతో ఆడుకోవడానికి పిల్లికి ఎంత ధైర్యం ఉండాలి అంటూ పిల్లి చాకచక్యాన్ని కొనియాడారు. ప్రస్తుతం ఈ ఫన్నీ అండ్ థ్రిల్లింగ్ వీడియో నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్