సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నా తండ్రి కుల వ్యవస్థకు వ్యతిరేకం.. అందుకే ‘బచ్చన్‌’ ఇంటి పేరు : అమితాబ్ బచ్చన్

1 గంట క్రితం

amitab bachan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : తన ఇంటిపేరు ‘బచ్చన్‌’ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వెల్లడించారు. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌-18’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తండ్రి, ప్రముఖ హిందీ కవి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ చిన్ననాటి నుంచే కుల వ్యవస్థను వ్యతిరేకించేవారని తెలిపారు. అందుకే తమ కుటుంబానికి ‘బచ్చన్‌’ అనే ఇంటిపేరును ఎంచుకున్నారని చెప్పారు. పాఠశాలలో ప్రవేశం సమయంలో దరఖాస్తు ఫారంలో కులానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉండేదని అమితాబ్‌ తెలిపారు. ఆ కాలంలో తన తండ్రి కుల వ్యవస్థను అంగీకరించకుండా, కులం స్థానంలో ‘బచ్చన్‌’ అని నమోదు చేశారని చెప్పారు. అప్పటి నుంచి అదే తమ కుటుంబ ఇంటిపేరుగా కొనసాగుతోందని వివరించారు. అమితాబ్‌ బచ్చన్‌ అసలు పేరు అమితాబ్‌ శ్రీవాస్తవ. 1942 అక్టోబర్‌ 11న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌)లో ఆయన జన్మించారు. ఆయన తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు. అమితాబ్‌ సినీ ప్రస్థానం ‘సాత్‌ హిందుస్తానీ’ చిత్రంతో ప్రారంభమైంది. కెరీర్‌ తొలినాళ్లలో అనేక విజయవైఫల్యాలను ఎదుర్కొన్న ఆయన.. ‘జంజీర్‌’, ‘దీవార్‌’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో అగ్రనటుడిగా ఎదిగారు. ఇప్పటికీ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్