మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "కొత్త సినిమా"

1 గంట క్రితం

"New Movie" heading for a grand theatrical release soon.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 01:15 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

పలువురు దర్శక నిర్మాతలు అతిథులుగా ఘనంగా "కొత్త సినిమా" 'వై ఇన్ హైదరాబాద్ వై నాట్ ఇన్ అవర్ ప్లేస్' ఈవెంట్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న మూవీ


హైదరాబాద్ బ్యూరో : సినిమా పట్టణంలోనే కాదు పల్లెపల్లెనా ఉంటుందని నిరూపిస్తూ కొత్త దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్ తో స్థానికంగా రూపొందించిన సినిమా "కొత్త సినిమా".


నటీనటులు - సురేశ్, రాకేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

-------------------

డీవోపీ - జానీ బాషా

బీజీఎం - పెద్దపల్లి రోహిత్

కొరియోగ్రఫీ - మొయిన్ మాస్టర్

ప్రొడ్యూసర్స్ - మహమ్మద్ వసీమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్, డైరెక్షన్ - అజర్

మార్కెటింగ్ - స్టార్ సర్కిల్

పీఆర్ఓ - గాండ్ల శ్రీనివాస్ (జీఎస్ మీడియా)


ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ టాలీవుడ్ కు పరిచయం కావడం విశేషం. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ సినిమా 'వై ఇన్ హైదరాబాద్ వై నాట్ ఇన్ అవర్ ప్లేస్' ఈవెంట్ పలువురు దర్శక నిర్మాతలు అతిథులుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ....


డీవోపీ జానీ బాషా మాట్లాడుతూ - గోదావరిఖని నుంచి మేము ఇక్కడిదాకా వచ్చామంటే కారణం మీ సపోర్ట్ వల్లే. మా అజర్ గారు ప్రతి ఒక్కరి టాలెంట్ చూసి వారిని తీసుకున్నారు. తెలియని వాళ్లకు నేర్పించారు. ప్రేక్షకులందరూ ఇష్టపడే ఒక మంచి మూవీ చేశారు. వర్క్ పట్ల సిన్సియర్ గా ఉంటే తప్పకుండా విజయం సాధిస్తాం అని ఆయన ప్రూవ్ చేయబోతున్నారు. మా కొత్త సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ - మా కొత్త సినిమాను సపోర్ట్ చేసేందుకు ఈ ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం కలిగింది. అందుకు మా అజర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా మ్యూజికల్ గా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.


నటుడు రాకేష్ మాట్లాడుతూ - నేను మా సినిమా కోసం లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మా మేనేజర్, ఇతర ఆఫీసర్స్ సహకారం అందిస్తారని కోరుకుంటున్నా. అందరం కొత్త వాళ్లం కలిసి కొత్త సినిమా చేశాం. మేము ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి. అన్నారు.


నటుడు సురేష్ మాట్లాడుతూ - ఒక సినిమాలో నేను మెయిన్ రోల్ చేశానని చెప్పుకునే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అజర్ నాకు అలాంటి అవకాశం కల్పించారు. సినిమా తీయడం ఈజీ అని అనుకోవద్దు. అది చేసే వారికే తెలుస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేశారు అజర్. మీలాంటి పెద్ద వాళ్లు అండగా నిలబడితే మాలాంటి కొత్త వాళ్లం గుర్తింపు తెచ్చుకుంటాం. అన్నారు.


క్రిటిక్ చల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ - ఈ సినిమా పోస్టర్ చూసినప్పుడు మధుర శ్రీధర్ గారికి కాల్ చేసి ఈ అజర్ అనే అబ్బాయి ఎవరు పోస్టర్ చాలా బాగుంది అని అడిగాను. ఇప్పుడు ఆర్గానిక్ సినిమా అనేది అందరికీ ఇష్టమైన జానర్ గా మారింది. అలాంటి సహజమైన చిత్రాన్ని అజర్ రూపొందించాడని నమ్ముతున్నాను. అన్నారు.


డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ - కొత్త వాళ్లం ఎవరూ సపోర్ట్ చేయరు అనుకున్నాం. కానీ మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ రోజు మా ఈవెంట్ కు పిలవగానే వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. సినిమా అనేది ప్రపంచంలో బలమైన మాధ్యమం. ఇలాంటి ప్రభావవంతమైన సినిమాను నేను కూడా రూపొందించాలనే ప్రయత్నం ఈ చిత్రంతో మొదలుపెట్టాను. రోజూ ఏదో ఒక పని పూర్తి చేశాననే సంతృప్తితోనే ఉండేవాడిని. నా కథతో వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లకుండా నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. నేను కొత్త, నాతో పాటు కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊరిలోనే ఆడిషన్స్ చేసి టాలెంట్ ఉన్నవారిని తీసుకున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అలా ఈ సినిమా మేకింగ్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాం. త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతున్నాం. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.


దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - అజర్ ఈ సినిమా టైటిల్ కొత్త సినిమా అని పెట్టడమే కాదు కొత్త ప్రయత్నం కూడా చేశాడు. అందరూ మేల్ ఆర్టిస్టులతో చేసిన మొదటి సినిమా ఇదే కావొచ్చు. ఇక్కడ సినిమా మేకింగ్ అంటే ఖర్చు, ఆర్టిస్టులు కూడా ఈజీగా దొరకరు. అందుకే అజర్ తన ఊరికి వెళ్లి, అక్కడే టాలెంట్ ఉన్న వారిని చూసుకుని, వారికి ట్రైనింగ్ ఇచ్చి, అక్కడే సినిమా రూపొందించాడు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా చేసి ఉంటాడని నమ్ముతున్నాను. ఆయనకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.


దర్శక నిర్మాత ఎన్ శంకర్ మాట్లాడుతూ - ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అజర్ తనలో ఉన్న ప్రతిభను ప్రూవ్ చేసుకుంటూ ఈ చిత్రాన్ని రూపొందించాడు. వందమీటర్ల లోతుకు వెళ్లి పనిచేసే బొగ్గు బావి ప్రాంతం సింగరేణి నుంచి వచ్చిన టెక్నీషియన్స్ అతను. ఈ చిత్రంతో ఒక సహజమైన సినిమా, ఒక మంచి సినిమా చేసి ఉంటాడని భావిస్తున్నా. అజర్ ఈ చిత్రంతో ఎంతోమంది కొత్త వారికి అవకాశం కల్పించడం అభినందనీయం. కొత్త సినిమా నిజంగానే కొత్తగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.


డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ - ప్రాంతీయ సినిమా వల్ల ఆ ప్రాంతానికే పేరు వచ్చిన సందర్బాలు ఉన్నాయి. మాలేగావ్ లో తీసిన సినిమాల వల్ల మాలేగావ్ కు మంచి పేరొచ్చింది. అలా సింగరేణి నేపథ్యంగా వస్తున్న ఈ చిత్రంతో ఆ ప్రాంతానికి మంచి పేరు రావాలి, దర్శకుడిగా అజర్ కష్టానికి ఫలితం దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.


డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ - మనకు ఎవరో అవకాశం ఇవ్వలేదని బాధపడుతూ, ఎవరో మనల్ని తొక్కేశారని నిందించడం తప్పు. అలాంటి వాళ్లు అజర్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎవర్నీ నిందించకుండా తనకున్న పరిమితుల్లో ఒక మంచి ప్రయత్నం చేసి సినిమా రూపొందించాడు. అప్పట్లో హృదయకాలేయంతో సాయి రాజేశ్ ఎలా ప్రయత్నించాడు. ఇప్పుడు అజర్ కూడా కొత్త సినిమా అలాగే చేశాడని అనిపిస్తోంది. ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకు వస్తుందని ఆశిస్తున్నా. మేమంతా అజర్ కు సపోర్ట్ గా నిలబడతాం. అన్నారు.


డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - దర్శకులకు కాన్ఫిడెన్స్ ఊపిరి లాంటిది. నా కథలో హీరో ఒక భాగం అనే నమ్మే ఆత్మవిశ్వాసం వారిలో ఉండాలి. నేను నా కెరీర్ లో అలాంటి కాన్ఫిడెన్స్ తోనే కొనసాగాను. దర్శకుడు అజర్ లో కూడా అలాంటి ఆత్మవిశ్వాసమే కనిపిస్తోంది. కొత్త సినిమా కంటెంట్ క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ చిత్రంతో అజర్ డైరెక్టర్ గా సక్సెస్ కావాలి. ఈ చిత్రంలో నటించిన కొత్త నటీనటులు అందరికీ మంచి పేరు రావాలి. అన్నారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్