పోలీస్ శాఖ నిర్వహించే పెట్రోల్ బంకులను వినియోగించుకోవాలి
ఆలమూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంక్‌లో కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు ఉంటాయని, ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆయన ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్, కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్.విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్ తదితరులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. పోలీసుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)