ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని కొత్తూరు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, యుటిఎఫ్ పూర్వపు నాయకులు గొలుగూరు భాస్కర్ రెడ్డి మిడ్ డే మీల్ వర్కర్ల సౌకర్యార్థం గ్యాస్ పొయ్యిని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తన వంతు సాయంగా తనకొచ్చే పెన్షన్ నుంచి కొంత మినహాయించి పాఠశాలలకు ఉపయోగకరమైన వస్తువులు కొనుగోలు చేసి అందజేయాలని తలచినట్లు తెలిపారు. దీంతో ఆయనకు ఎంఈఓలు అప్పాజీ, రాజు, పాఠశాల హెచ్ఎం వై.వి.వి.రమణ పాఠశాల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీపీ స్కూలుకు రిటైర్డ్ హెచ్ఎం గ్యాస్ పొయ్యి అందజేత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 01:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)