బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రిస్మస్‌కు షారుఖ్‌ ఖాన్‌ ‘కింగ్‌’

20 గంటల క్రితం

క్రిస్మస్‌కు షారుఖ్‌ ఖాన్‌ ‘కింగ్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 05:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం ‘కింగ్‌’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్లు షారుఖ్‌ సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో షారుఖ్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపికా పదుకొణె, అభిషేక్‌ బచ్చన్‌, రాణి ముఖర్జీ తదితరులు నటిస్తున్నారు. ‘పఠాన్‌’ తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుఖ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్